
హైదరాబాద్, 29 జూలై (హి.స.)
లభించింది. ఆయన అనుమతి లేకుండా పేరు, చిత్రాన్ని వ్యాపార ప్రకటనలు, ఉత్పత్తుల విక్రయాలకు ఉపయోగించడంతో పాటు సోషల్ మీడియాలో ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన 'వ్యక్తిత్వ హక్కుల' (Personality Rights) పరిరక్షణను కోరుతూ యువరాజ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
యువరాజ్ సింగ్ అనుమతి లేకుంటే ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ లేదా గుర్తింపును ఎవరూ వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అనధికారికంగా లేదా అనుచితంగా పోస్ట్ చేసిన వివరాలను 48 గంటల్లోగా ఆయా వ్యక్తులే స్వయంగా తొలగించాలని, ఒకవేళ వారు స్పందించకపోతే సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 36 గంటల వ్యవధిలో ఆ లింకులను (URLs) తొలగించాలని కోర్టు ఆదేశించింది. సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రజనీకాంత్ వంటి ఇతర ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పుల తరహాలోనే యువరాజ్‌కు కూడా కోర్టు ఈ మధ్యంతర ఉపశమనం కల్పించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi