
ముంబై, 03 జూలై (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. ఇటీవల భారీగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వచ్చాయి. తులం బంగారం ధర రూ.1,60,000లకుపైగా వెళ్లిగా, ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా జూలై 3న దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,810 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,810 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,9400 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,960 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,810 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,810 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,010 వద్ద కొనసాగుతోంది.
కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,810 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,45,100 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు నిరంతరం తగ్గుతుండటం, ధరలు మరింత పడిపోతాయనే భయాలను పెంచింది. ఫలితంగా ప్రజలు బంగారాన్ని కొనడానికి బదులుగా అమ్ముతున్నారు. భారతీయులు ప్రస్తుత త్రైమాసికంలోనే దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మారు. దీనివల్ల స్థానిక మార్కెట్లలో సరఫరా అకస్మాత్తుగా పెరిగి, ధరలు పడిపోతున్నాయి.
బలహీనమైన ప్రపంచ మార్కెట్ ధోరణులు బంగారం ధరలపై భారం మోపాయి. అమెరికన్ డాలర్ బలపడటం బంగారాన్ని మరింత బలహీనపరిచింది. డాలర్ బలపడినప్పుడు, ఇతర కరెన్సీలను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఇది బంగారం డిమాండ్ను తగ్గించి, ధరలు పడిపోయేలా చేస్తుంది. పెరుగుతున్న ట్రెజరీ బాండ్ల రాబడులు కూడా బంగారం ఆకర్షణను తగ్గిస్తాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బాండ్ల వైపు మొగ్గు చూపుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV