పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Commodity market Gold and silver prices fall


ముంబై, 30 జూలై (హి.స.)ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్యంలో ధరలు భారీగానే దిగి వస్తున్నాయి. తాజాగా జూలై 30వ తేదీన స్వల్పంగా దిగి వచ్చాయి. అయితే గత వారం రోజుల్లో 2 వేల రూపాయలకుపైగానే దిగి వచ్చింది. భారతీయులకు పసిడిపై మక్కువ ఎక్కువ. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సంప్రదాయల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలంకరణ ఆభరణంగానే కాకుండా అత్యవసర సమయంలో ఆదుకునే ఆర్థిక సాధనంగానూ బంగారాన్ని చూస్తారు

గురువారం ఉదయం కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,500గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,540గా ఉంది (Live Gold Rates).మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.

హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,650 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande