పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు..! ఇవాళ్టి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు..! ఇవాళ్టి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
Gold is cheaper in the bullion market, silver prices also decline slightly


ముంబై, 31 జూలై (హి.స.)భారతదేశంలో బంగారం ఎప్పుడూ ప్రియమైనదే.. పండుగలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజులు ఇలా శుభ సందర్భం ఏదైనా సరే.. మన వాళ్లు తప్పనిసరిగా గోల్డ్ కొంటుంటారు. కానీ, గత రెండేళ్ల కాలంలో పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కనీస అవసరాలకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా చేసింది. 2025 సంవత్సరాంతం వరకు గోల్డ్ షాకిస్తూనే వచ్చింది. ఇక, ఈ ఏడాది ఆరంభం నుండి తగ్గుతూ, పెరుగుతూ లక్షన్నరకు అటు ఇటూగా ఊగిసలాడుతూ వస్తోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,44,490, 22 క్యారెట్ల ధర రూ.1,32,460 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

కోల్కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100లుగా ఉంది.

హైదరాబాద్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande