
హైదరాబాద్, 31 జూలై (హి.స.)
కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:50 గంటల సమయంలో మరణించారు.ఈ నెల 26వ తేదీన (ఆదివారం) ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హనుమకొండలోని స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గంటసేపు తీవ్రంగా శ్రమించి, తొమ్మిదిసార్లు సీపీఆర్ (CPR) చేసి ఆయన గుండె స్పందనను పునరుద్ధరించారు. అరగంట పాటు గుండె ఆగిపోవడంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యింది. మూడు రోజుల పాటు వైద్యులు శ్రమించినా ఆయన కోలుకోలేదు. ఇక గురువారం అర్ధరాత్రి ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో తెలంగాణ ఉద్యమం ఎంతటి కీలక పాత్ర పోషించిందో, ఆయన వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథనం కూడా అంతే ప్రత్యేకమైనది. ఆయన లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. దాని వెనుక ఒక కారణం కూడా ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi