
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్
ఇన్ స్టాగ్రామ్ లో మెటా కొన్ని మార్పులు చేయడంతో పాటు యాప్ లోగోను సైతం మార్చింది. దాదాపు పదేళ్ల తరవాత ఇన్ స్టాగ్రామ్ లోగోను మార్చారు. చివరగా 2016 ఇన్ స్టాలోగో డిజైన్ అప్ డేట్ చేయగా తాజాగా సరికొత్త డిజైన్ లోగోతో ఆకట్టుకుంటోంది. ఇది వరకు ఉన్న లోగో ఇంద్రధనస్సు రంగులతో కనిపించేది. కాగా తాజా లోగో కేవలం తెలుపు రంగులో కనిపిస్తోంది. అంతేకాకుండా తాజాగా కీలక అప్డేట్ తీసుకువచ్చింది. ఈ అప్డేట్లో ఇన్స్టా యాప్ మధ్యలో ఉన్న లోగోపై క్లిక్ చేస్తే ఫాలోయింగ్, ఫేవరెట్స్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.
ఇక్క ఫాలోయింగ్ పై క్లిక్ చేస్తే మనం ఫాలో చేస్తున్న వారి పోస్టులు మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా ఫేవరెట్స్ లో మనం ఖచ్చితంగా చూడాలి అనుకున్నవారి అకౌంట్స్ మాత్రమే యాడ్ చేసుకుని మిస్ కాకుండా చూడొచ్చు. మరోవైపు యాప్ బ్యాగ్రౌండ్ కూడా పూర్తిగా నలుపు రంగలోకి మారిపోయింది. చూడ్డానికి కొత్త అప్డేట్ థ్రెడ్స్ యాప్ ను పోలి ఉంది. ఇక ఇది వరకు రీల్స్, ఫోటోలు షేర్ చేయాలి అంటే కింది భాగంలో మధ్యలో ఆప్షన్ కనిపించేది. కానీ ఇప్పుడు స్టోరీ షేర్ చేసే ఆప్షన్ లోనే రీల్స్, ఫోటోలు షేర్ చేసే ఆప్షన్ ఇచ్చారు. అదే విధంగా సెర్చ్ ఆప్షన్ కింది భాగంలో ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..