
కొమ్రం భీం ఆసిఫాబాద్, 15 ఆగస్టు (హి.స.)
కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు గురుకులాల విద్యా ప్రమాణాలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం ‘ప్రత్యేక విద్యా మిషన్’ ను అధికారికంగా ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అధునాతన సైన్స్ లాబ్‌లు మరియు విద్యార్థులకు ప్రత్యేక వసతులను కల్పించనున్నారు. గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఇవాళ ఉదయం పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi