
శ్రీశైలం, 16 ఆగస్టు (హి.స.) శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. పై రాష్ట్రాల్లో వర్షాలు ఆగిపోవడంతో.. కృష్ణా నదిపై ఉండే ఆలమట్టితో సహా ప్రధాన జలాశయాల గేట్లన్నీ మూసుకుపోయాయి.
శ్రీశైలం జలాశయం గరిష్ఠ స్థాయి నిల్వ 215.810 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 176.331 టీఎంసీల నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు విద్యుదుత్పత్తి ద్వారా 72,640 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్లో గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ 158 టీఎంసీల నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం వదులుతున్న కృష్ణా జలాలతో విద్యుదుత్పత్తిని గరిష్ఠ స్థాయిలో కాకుండా కొద్దిగా తగ్గించాలని ఏపీజెన్కోను రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV