మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 8 వ వర్ధంతి నేడు
మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 8 వ వర్ధంతి నేడు
Chandrababu Naidu(file)


అమరావతి, 16 ఆగస్టు (హి.స.) అమరావతి, :మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు. వాజ్పేయి సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

వాజ్పేయి జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారు: సీఎం చంద్రబాబు

దేశభక్తి, దూరదృష్టి, సమ్మిళితత్వానికి వాజ్పేయి ప్రతీక అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 'దేశమే ప్రథమం' అనే స్ఫూర్తితో తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్పేయి అందించిన మద్దతు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

వాజ్పేయి చరిత్రను మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు: పవన్ కల్యాణ్

భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన కాలానికి అతీతమైన దార్శనికత కలిగిన, బలమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన, స్వయం సమృద్ధిగల, పునరుజ్జీవనం పొందిన భారత్ను కలలు కన్న రాజనీతిజ్ఞుడు వాజ్పేయిని ఈ సందర్భంగా స్మరించుకుందామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

దేశ ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల పురోగతిలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారు: లోకేశ్

అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి తన నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల పురోగతిలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని తెలిపారు. భారతరత్న వాజ్పేయి వర్ధంతి సందర్భంగా, ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుందామని నారా లోకేశ్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande