కోలుకుంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా.. ఢిల్లీ ఎయిమ్స్ హెల్త్ బులిటెన్ విడుదల
కోలుకుంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా.. ఢిల్లీ ఎయిమ్స్ హెల్త్ బులిటెన్ విడుదల
Nadda


న్యూఢిల్లీ, 18 ఆగస్టు (హి.స.)

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

మంత్రి జేపీ నడ్డా (JP Nadda)కు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో వైద్యులు విజయవంతంగా యాంజియోప్లాస్టీ ప్రక్రియను నిర్వహించారు. స్వల్ప గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కార్డియాలజీ విభాగానికి చెందిన నిపుణులైన వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, యాంజియోప్లాస్టీ చికిత్సను పూర్తి చేసింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో కోలుకుంటున్నారని హెల్త్ బులిటెన్ ద్వారా ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆయన కీలకమైన ఆరోగ్య పారామితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర మంత్రి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande