కంటైనర్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు : వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్
కంటైనర్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు : వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్
Mla


ఖమ్మం, 19 ఆగస్టు (హి.స.)

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామంలో కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చర్యలు చేపట్టారు. ప్రజావాణి కార్యక్రమంలో కొత్త మేడేపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో పాఠశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంలో మంజూరైన కంటైనర్ స్కూల్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు. దీంతో అక్కడే ఉన్న ఎంఈఓ వాసవి దేవిని ఎమ్మెల్యే పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడి కొత్త మేడేపల్లి గ్రామంలో కంటైనర్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande