నేడు త్రివర్ణ పతాక.రూపకర్త పింగళి వెంకయ్య 150 వ జయంతి
త్రివర్ణ పతాక.రూపకర్త పింగళి వెంకయ్య 150 వ జయంతి...నివాళులర్పించిన పవన్ కళ్యాణ్
pawan


అమరావతి, 02 ఆగస్టు (హి.స.)

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan)స్మరించుకున్నారు. మన ఐక్యత, స్వేచ్ఛ, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని భారత్కు అందించారని కొనియాడారు. ఆ దార్శనికుడికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, భట్లపెనుమర్రు గ్రామంలో పింగళి వెంకయ్య జన్మించారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశానికి అత్యంత ప్రియమైన చిహ్నాన్ని ఆయన అందించడం ప్రతి తెలుగు వ్యక్తికి అపారమైన గర్వకారణమని చెప్పుకొచ్చారు. పింగళి వెంకయ్య అసాధారణ వారసత్వం మన జాతీయ పతాక గౌరవాన్ని, స్ఫూర్తిని నిలబెట్టడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande