హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అనూహ్య బదిలీ
హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్బాబును ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Aravind rao


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.): హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్బాబును ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మెటా ఇండియా హెడ్పై నగర సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో డీసీపీ ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇటీవల దిల్లీలో భారీఎత్తున నిరసనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చివరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఆందోళనల నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఫొటో, వీడియోలు మార్ఫింగ్ చేసిన రీల్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారాయి.

ఆయా పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా.. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేలా.. శత్రుత్వం పెంచేలా.. దేశభద్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ భాజపా సామాజిక మాధ్యమ విభాగం నాయకులు గత నెల 29న నగర సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టులు ప్రచారం చేసిన వారితోపాటు మెటా ఇండియా హెడ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సైబర్క్రైమ్ పోలీసులు 66-సి, 67ఐటీఏ-2000-2008, 353(2), 336(4) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే డీసీపీని అనూహ్యంగా బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande