రెండు నౌకలు హైజాక్ .. 22 మంది భారతీయులు క్షేమం
రెండు నౌకలు హైజాక్ .. 22 మంది భారతీయులు క్షేమం
Hijak


న్యూఢిల్లీ, 21 ఆగస్టు (హి.స.)

రెండు నౌకలను పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ నౌకల్లో 22 మంది భారతీయులు(Indians Hijacked) ఉన్నారు. యెమెన్, సోమాలియా తీరాల్లో ఆ నౌకలను హైజాక్ చేసినట్లు సీనియర్ షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒకరు చెప్పారు. ఆయిల్ ట్యాంకర్తో ఎరిత్రియాకు వెళ్తున్న ఎంటీ సిబు 1 నౌకలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 16 మంది భారతీయులు అని తెలిసింది. అయితే గల్ఫ్ ఆఫ్ ఎడన్ వద్ద సముద్ర దొంగలు ఆ నౌకను హైజాక్ చేసినట్లు గుర్తించారు. ఆగస్టు 20వ తేదీన యెమెన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కెమెరూన్కు వెళ్తున్న మరో కార్గో షిప్ను కూడా పైరేట్స్ హైజాక్ చేశారు. సోమాలియాలోని పుంట్యాండ్ కోస్టు వద్ద ఆగస్టు 17వ తేదీన ఈ ఘటన జరిగింది. 10 మంది ఉన్న ఆ నౌకలో ఆరుగురు భారతీయులే. అయితే తాజా సమాచారం ప్రకారం రెండు నౌకలకు చెందిన భారతీయులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande