ఢిల్లీ 'సంసద్ మార్గ్' పీఎస్ ఎదుట హైడ్రామా.. నిరసనకు దిగిన రాహుల్ గాంధీ
ఢిల్లీ 'సంసద్ మార్గ్' పీఎస్ ఎదుట హైడ్రామా.. నిరసనకు దిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi


న్యూఢిల్లీ, 21 ఆగస్టు (హి.స.)

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని 'సంసద్ మార్గ్'లో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లారు. జూలై 20న పార్లమెంట్కు చేపట్టిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు ప్రయోగించిన పోలీసు సిబ్బందిపై వెంటనే ఎఫ్ఎఆర్ (FIR) నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన మార్చ్లో పెల్లెట్ గాయాలపాలైన విద్యార్థి సాహిల్ లోచాబ్తో కలిసి రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వచ్చారు.

అయితే, రాహుల్ గాంధీ బాధితుడితో కలిసి మొదట మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా పిల్లెట్ గన్ ఉపయోగించారనే ఫిర్యాదు వారు తీసుకోలేదు. దీంతో రాహుల్ గాంధీ నేరుగా పార్లమెంట్ స్ట్రీట్లోని సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయానికి వెళ్లారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై పెల్లెట్ తుపాకులను ప్రయోగించడం అత్యంత ఖండనీయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande