వాహనదారులకు ‘NHAI బంపరాఫర్.. ఇక నెలకు రూ.350లకే మంత్లీ టోల్ పాస్
వాహనదారులకు ‘NHAI బంపరాఫర్.. ఇక నెలకు రూ.350లకే మంత్లీ టోల్ పాస్
Toll pass


హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు ఊరట కలిగిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.350లకే నెలవారీ టోల్ పాస్ (FASTag Local Pass) పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా, పూర్తి డిజిటల్ విధానంలో ఆన్లైన్ ద్వారానే ఈ-పాస్ పొందే సదుపాయాన్ని తీసుకురానుంది. అయితే, ఇంతకు ముందు టోల్ ప్లాజాల వద్దకు నేరుగా వెళ్తేనే లభించే నెలవారీ పాస్ సేవలను ఇప్పుడు పూర్తి డిజిటల్ రూపంలోకి మార్చారు. ఈ కొత్త ఆన్లైన్ పాస్ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 121 టోల్ ప్లాజాలకు NHAI విస్తరించింది. దీంతో స్థానిక వాహనదారులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించకుండానే ఇంటి నుంచే పాస్ పొందే అవకాశం లభించింది.

నిర్దేశిత టోల్ ప్లాజా నుంచి 20 కి.మీ పరిధిలో నివసిస్తున్న స్థానిక నివాసితులు మాత్రమే ఈ పాస్కు అర్హులుగా NHAI గుర్తించనుంది. ఈ మంత్లీ పాస్ సదుపాయం కేవలం సొంత, ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా దాటే స్థానికులకు ఈ పాస్ ద్వారా భారీగా ఆర్థిక భారం తగ్గనుంది. ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం NHAI వ్యవస్థను ప్రభుత్వ డేటాబేస్లతో లింక్ చేశారు. దరఖాస్తుదారుడి ఇంటి చిరునామాను నిర్ధారించడానికి డిజిలాకర్ (DigiLocker), ລ້ ລ້ລ້ సరిచూసేందుకు 'వాహన్' (VAHAN) పోర్టల్ను ఉపయోగించనున్నారు. అడ్రస్, వాహన వివరాలు సరిపోలిన వెంటనే, లోకల్ పాస్ ఆటోమేటిక్గా మీ

వాహన ఫాస్టాగ్ (FASTag)కి లింక్ కానుంది.

మంత్లీ లోకల్ పాస్ కోసం అర్హులైన స్థానిక వాహనదారులు NHAI కి చెందిన అధికారిక రాజ్మార్గ్ యాత్ర (Rajmargyatra) మొబైల్ యాప్ ద్వారా చాలా సులభంగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని ఈ లోకల్ పాస్ను పొందవచ్చు. టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా నేరుగా ప్రయాణించే మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF), బారియర్- లెస్ టోలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు NHAI సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా పరిచయాలతో టోల్ దాటే స్థానిక వాహనాలకు, ఆటోమేటిక్ కెమెరాల ద్వారా పెండింగ్ టోల్ ఈ-నోటీసులు జారీ అవుతున్నాయి. ఈ డిజిటల్ పాస్ను ఫాస్టాగ్కి లింక్ చేయడం వల్ల స్థానికులకు ఎలాంటి అదనపు ఛార్జీలు, నోటీసులు రాకుండా నిరోధించే అవకాశం ఉంది. అయితే, ఈ డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని మొదట న్యూఢిల్లీలోని ముండ్కా-బక్కర్వాలా టోల్ ప్లాజా వద్ద పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో దీనిని దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలకు వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande