సంపూర్ణ వందేమాతర గౌరవం, వారసత్వ పరిరక్షణే లక్ష్యం.. దేశవ్యాప్త ప్రచారానికి బీజేపీ పిలుపు
సంపూర్ణ వందేమాతర గౌరవం, వారసత్వ పరిరక్షణే లక్ష్యం.. దేశవ్యాప్త ప్రచారానికి బీజేపీ పిలుపు
BJP


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

భారత జాతీయ గీతమైన 'వందేమాతరం' గౌరవం, ఔన్నత్యం, ఘనమైన చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక తీర్మానం చేసింది. 1950లో రాజ్యాంగ సభ చేసిన ప్రకటన, 2026 లో పార్లమెంట్ ద్వారా జాతీయ గీతానికి కల్పించిన చట్టబద్ధమైన రక్షణను పునరుద్ఘాటిస్తూ.. సంకుచిత ఓటు బ్యాంక్ రాజకీయాలు, మతపరమైన ఒత్తిళ్లు, రాజకీయ తుష్టీకరణల కోసం వందేమాతరం ప్రాముఖ్యతను తగ్గించే ఎలాంటి ప్రయత్నాలనైనా గట్టిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు రాజ్యాంగ సంస్థలు, పార్లమెంట్ చేసిన చట్టాల కంటే పైవి కావని గుర్తు చేస్తూ, గతంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల ఒత్తిడికి తలొగ్గి వందేమాతరం గీతాన్ని పరిమితం చేసిన చారిత్రక, రాజకీయ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది.

మహాత్మా గాంధీ పేర్కొన్నట్లుగా వందేమాతరం అనేది సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదం, స్వచ్ఛమైన జాతీయ భావనలకు ప్రతీక అని బీజేపీ స్పష్టం చేసింది. ఆరు చరణాలతో కూడిన సంపూర్ణ వందేమాతర గీతం చరిత్ర, అంతరార్థం, జాతీయ ప్రాముఖ్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి, ముఖ్యంగా యువతరానికి చేరవేసేలా పార్టీ కార్యకర్తల ద్వారా దేశవ్యాప్త అవగాహన ప్రచారోద్యమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వందేమాతరం అనేది కేవలం ఏదో ఒక రాజకీయ పక్షానికి చెందిన అంశం కాదని, యావత్ భారత గౌరవానికి, దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం అర్పించిన అసంఖ్యాక దేశభక్తుల త్యాగాలకు ప్రతీక అని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం దీని గౌరవంతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని బీజేపీ పార్టీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande