మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి!
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి!
AccidentAccident


మధ్యప్రదేశ్, 22 ఆగస్టు (హి.స.)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక ప్రయాణికుల కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వాహనం నుంచి వెలుపలికి తీసి హుటాహుటిన సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande