
ముంబై, 22 ఆగస్టు (హి.స.)బంగారం కొనుగోలు దారులకు నేడు పసిడి ధరలు స్వల్ప ఊరటను కలిగించాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ పెద్దగా మార్పులు ఏమి కనిపించలేదు. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం...
నిన్నటితో పోల్చుకుంటే శనివారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పు ఏమిలేదు.. ప్రస్తుతం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,490గా ఉండగా.. నిన్న ఈ ధర రూ. 1,60,480గా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,110 ఉండగా నిన్న ఈ ధర రూ1,47, 100గా ఉంది. ఇక 18 క్యారట్ల బంగార ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి సైతం బంగారం బాటలోనే నడుస్తోంది. దేశీయ మార్కెట్లో నిన్న కేజీ వెండి ధర రూ.2,60,000గా ఉన్న వెండి ధర రూ.100 పెరిగి ప్రస్తుతం 2,60,100 ట్రేడవుతుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,47,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,60,640, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల ధర రూ.1,47,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల ధర రూ.1,47,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల ధర రూ.1,47,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV