ఏపీలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా: డిజిటల్ పర్యవేక్షణపై ఇంధన శాఖ మంత్రి ప్రత్యేక సమీక్ష
ఏపీలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా: డిజిటల్ పర్యవేక్షణపై ఇంధన శాఖ మంత్రి ప్రత్యేక సమీక్ష
electricity


అమరావతి 23 ఆగస్టు (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో గృహ, పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఇంధన శాఖ మంత్రి ఈరోజు ఉదయం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సబ్‌స్టేషన్లలో జరుగుతున్న లోడ్ మేనేజ్‌మెంట్‌ను, సాంకేతిక లోపాలను గుర్తించేందుకు సరికొత్త డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థను (Digital Monitoring System) క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా లైన్లు తెగిపడినా, స్తంభాలు కూలినా గంటల వ్యవధిలోనే పునరుద్ధరించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande