
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటి కారణంగా కవల జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఈరోజు ఉదయం జలవనరుల శాఖ అధికారులు ఎత్తివేశారు. దీనివల్ల మూసీ నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఉమ్మడిగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి వరద ఉధృతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi