హైదరాబాద్ను వణికిస్తున్న భారీ వర్షం: పలు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్ను వణికిస్తున్న భారీ వర్షం: పలు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
rain


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహదీపట్నం పరిసర ప్రాంతాలలో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. హఠాత్తుగా కురిసిన ఈ వాన వల్ల ఐటీ కారిడార్ పరిధిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (DRF) బృందాలు తక్షణమే రంగంలోకి దిగి మ్యాన్‌హోల్స్ క్లియర్ చేస్తూ నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి. రాబోయే కొన్ని గంటల పాటు నగరంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande