సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్: డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశం
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్: డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశం
Coal


భద్రాద్రి కొత్తగూడెం, 23 ఆగస్టు (హి.స.)

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పరిధిలోని కార్మిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక సానుకూల ప్రకటన చేసింది. సింగరేణిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ (కారుణ్య నియమకాల) ఉద్యోగాల భర్తీ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఉదయం అధికారులను ఆదేశించారు. వైద్య కారణాల రీత్యా అన్‌ఫిట్ అయిన మరియు పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు అర్హతను బట్టి తక్షణమే నియామక పత్రాలు అందజేసేలా ప్రత్యేక డిజిటల్ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంపై సింగరేణి కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande