
ముంబై, 23 ఆగస్టు (హి.స.)అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,090గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,49,500గా ఉంది (Live Gold Rates). అలాగే ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,70,000గా ఉంది.
కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు: భారత్, చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న రిజర్వుల్లో డాలర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి.
వెండికి పెరిగిన పారిశ్రామిక డిమాండ్: బంగారం రేటు పెరిగేటప్పుడు వెండి ధర కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. దీనికి తోడు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరగడం వల్ల వెండికి డిమాండ్ ఊహించని రీతిలో పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV