
విజయవాడ, 23 ఆగస్టు (హి.స.)
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్దకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలవనరుల శాఖ అధికారులు ఈరోజు మధ్యాహ్నం ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టారు. బ్యారేజ్ లోని కంట్రోల్ రూమ్ ద్వారా ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో వివరాలను నిరంతరం డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు నదీ తీర ప్రాంతాల ప్రజలు మరియు లంక గ్రామాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi