నేను ఎదగడానికి రేవంత్ రెడ్డి కారణం : మంత్రి సీతక్క
నేను ఎదగడానికి రేవంత్ రెడ్డి కారణం : మంత్రి సీతక్క
Seethakka


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

ఆదివాసి బిడ్డనైన తనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరిగా భావిస్తూ ఈ స్థాయికి రావడానికి కారకులు అయ్యారని, దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం రాఖీ పండుగను పురస్కరించుకొని హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం ఇంటి ముందున్న మీడియా ప్రతినిధులకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారని, సోదరుల రక్షణ కోసమే రాఖీ పండుగను నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా గత 12 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన స్వంత సోదరుడిగా భావిస్తూ రాఖీ కడుతూనే ఉన్నానని, ఆదివాసి బిడ్డ, అడవి బిడ్డ నైనా తాను ఈ స్థాయికి రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర కృషి చాలా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ములుగు ప్రజల ఆశీస్సులు దీవెనలతో నా జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తున్నానని, తాను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande