
హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్.పాటిల్ తో బుధవారం సీఎం భేటీ అయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై ఈ భేటీలో చర్చించారు. మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని కోరారు. 148 మీటర్ల ఎత్తునకు.. గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిదని సీఎం చెప్పారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపే ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతకుముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖా పరమైన అనుమతులపై చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..