భాజపా రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా..? : సీఎం రేవంత్
ప్రధాని మోదీని తిడితే భాజపా రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
Revanth reddy


హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.) ప్రధాని మోదీని తిడితే భాజపా రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రధానిని దూషిస్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ఒక డీఎస్పీని బదిలీ చేశారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంటున్నారని.. అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారమని పేర్కొన్నారు. తన పరిధిలో ఉంది కాబట్టే బదిలీ చేశానని చెప్పారు. భాజపా నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారని సీఎం విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande