ప్రజలకు సంక్షేమ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర
ప్రజలకు సంక్షేమ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర
Minister


సంగారెడ్డి, 07 ఆగస్టు (హి.స.)

ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య,

తాగునీరు, సంక్షేమ సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి వాటి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్యం, విద్య, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖల పనితీరు, పథకాల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు.

వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి...

జిల్లాలో వైద్య సేవల బలోపేతంపై చర్చించిన మంత్రి, జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ స్థానంలో నకిలీ వ్యక్తి విధులు నిర్వహించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల్లో వైద్యుల హాజరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీసీ హెచ్ఎస్, ఆసుపత్రి సూపరింటెండెంట్లను ఆదేశించారు. కంకోల్, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని, బర్దిపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట పీ హెచ్ సీ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ ఎంసీహెచ్ లను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి జీజీహెచ్ లో మందులు, పరికరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్కు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande