వరుణ యాగం ఏర్పాట్లను పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్
వరుణ యాగం ఏర్పాట్లను పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్
Collector


నాగార్జునసాగర్, 07 ఆగస్టు (హి.స.)

నాగార్జునసాగర్ సమీపంలోని

విజయ విహార్లో ఈ నెల 10న నిర్వహించనున్న మహా వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారన్న ప్రాథమిక సమాచారం నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం యాగం నిర్వహించనున్న ప్రాంగణాన్ని సందర్శించి ఏరు. యాగస్థలి, ప్రవచనశాల, యాగ నిర్వహణకు అవసరమైన య, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాగశాల నిర్మాణం, బారికేడింగ్, పగోడాలు, టెంట్లు, ఎస్ఈడీ స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఋత్వికులు, అర్చకులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు. యాగానికి వచ్చే భక్తులు, సాధారణ ప్రజలు, ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, మూత్రశాలలు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు. యాగ ప్రాంగణం మొత్తం ప్రణాళికతో కూడిన నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. విజయ విహార్ పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కోటేశ్వరరావుకు కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ రమేష్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, యాదాద్రి దేవాలయ డిప్యూటీ ఈవో డి. భాస్కర్, జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కే. భాస్కర్, డీఎస్పీ రవి, ఆరి శ్రీనివాసరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande