బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్: చెక్ బౌన్స్ కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్: చెక్ బౌన్స్ కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్: చెక్ బౌన్స్ కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు దశాబ్ద కాలం నాటి చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ, న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన రూ. 34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెలువడింది. 2015లో రోహిత్ రెడ్డి ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, సంస్థ వనరులను తన వ్యక్తిగత వ్యాపారాలకు వినియోగించి నష్టం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాద పరిష్కారానికి ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా 2014 సెప్టెంబర్ 25న రోహిత్ రెడ్డి సదరు సంస్థకు చెక్కును అందజేశారు.

అయితే, ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో ఆ చెక్ 2014 అక్టోబర్, డిసెంబర్ మధ్య మూడుసార్లు బౌన్స్ అయింది. దీనిపై సంస్థ పంపిన లీగల్ నోటీసులకు రోహిత్ రెడ్డి స్పందించకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన హైదరాబాద్ మొదటి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (మున్సిపల్ కోర్టు), నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది.

తీర్పు వెలువడే సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం శిక్షాకాలాన్ని ఖరారు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande