మహిళా అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మహిళా అధికారులను అభినందించారు.
AP CM


ఆంధ్రప్రదేశ్ , 10 సెప్టెంబర్ (హి.స.)జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు

మహిళా అధికారులను అభినందించారు.

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణిని సీఎం చంద్రబాబు అభినందించారు. డీఎస్సీ నిర్వహణపై వచ్చిన దుష్ప్రచారాన్ని ఈ ఇద్దరు మహిళా అధికారులు సమర్థంగా తిప్పికొట్టారని ఆయన కొనియాడారు. మనం డీఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించామని, విమర్శలు వచ్చినప్పుడు వాస్తవాలను ప్రజలకు ధైర్యంగా వివరించాల్సిన బాధ్యతను వీరు చక్కగా నిర్వర్తించారని సీఎం ప్రశంసించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande