కృష్ణా జలాల పిటిషన్ విచారణ అక్టోబర్ 13కి వాయిదా
కృష్ణా జలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయ స్థానం విచారణ వాయిదా వేసింది.
Supreme Court


ఆంధ్రప్రదేశ్ , 10 సెప్టెంబర్ (హి.స.)కృష్ణా జలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయ స్థానం విచారణ వాయిదా వేసింది. అక్టోబర్ 13న ఏపీ రిట్ పిటిషన్పై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా ట్రైబ్యునల్కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను ఏపీ సవాలు చేసింది. ట్రైబ్యునల్లో వాదనలు ఇప్పటికే తుది దశకు చేరాయని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ విచారణను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande