420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: ఎమ్మెల్యే మల్లారెడ్డి
420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: ఎమ్మెల్యే మల్లారెడ్డి
Mla


హైదరాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే చామకూర మల్లా రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారయ్యి తనదైనస్టైల్లో స్టెప్పులు వేస్తూ కార్యకార్లను ఉర్రూతలూగించాయి..ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ 420 మీటర్ల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలు కాని హామీలను వివరిస్తూ బాకీ కార్డులు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. తాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఏడు రోజుల పాటు రోజుకొక నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande