కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
MLA


ఆసిఫాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.)

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వేళ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం పేరిట ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. మోసపూరిత హామీలు, వాగ్దానాలతో జనాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande