కాళేశ్వరంలో కుట్ర జరిగితే అప్పుడెందుకు కేసు పెట్టలేదు: కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో, అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని ఆరోపించారు.
Srihari


హైదరాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో, అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని ఆరోపించారు. ఈరోజు (బుధవారం) లింగాల గణపురంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. బీజేపీ నేతలు సర్వేల్లో, పోటీల్లో వెనుకబడుతున్నారని రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోని పదేళ్లు తెలంగాణ మీద పడి లక్షల కోట్లు దోచుకున్నారని.. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత చెప్పిందని ప్రస్తావించారు.

దోచుకున్న సొత్తును లెక్కపెట్టేందుకు వారికి సమయం సరిపోవడం లేదని కవిత చెప్పారని కడియం శ్రీహరి అన్నారు. ఎక్కడో పంపకాల్లో తేడా రావడంతో ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు ఉంటే తమ మీద విమర్శలు, వ్యతిరేకంగా నిరసనలు చేయడం కాదని.. కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరంలోని ప్రధాన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు అప్పుడే కుంగిపోయాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కుట్ర జరిగిందనే అనుమానం ఉంటే అప్పుడెందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande